మార్చ్ 7న టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల జాతర !

తెలుగు ప్రేక్షకుల ముందుకు డబ్బింగ్ చిత్రాలు పెద్ద సంఖ్యలో వస్తున్నా.. కొద్ది సినిమాలకే ఆదరణ లభిస్తోంది. ఇటీవల అజిత్ నటించిన ‘పట్టుదల’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవగా.. తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ‘రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్’, మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ ‘మార్కో’ మాత్రం మంచి సక్సెస్ అందుకున్నాయి. అంతకు ముందు వచ్చిన సూర్య ‘కంగువ’ ఘోర పరాజయాన్ని చవిచూడగా.. శివ కార్తికేయన్ ‘అమరన్’ మంచి విజయం సాధించింది.
ఇంక ఈ వారంలో విడుదలైన డబ్బింగ్ చిత్రాల్లో... ఆది పినిశెట్టి నటించిన ‘శబ్దం’ చిత్రానికి, ‘అఘత్య’ అనే మరో డబ్బింగ్ సినిమా పోటీగా నిలిచింది. అయితే, వచ్చే వారమంతా టాలీవుడ్ లో పూర్తిగా డబ్బింగ్ చిత్రాల జాతర కొనసాగనుంది. మార్చి 7న మూడు విభిన్న భాషల నుండి మూడు డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఛావా
ప్రస్తుతం అందరిలో హాట్ టాపిక్‌గా ఉన్న ఈ చిత్రం.. హిందీలో ఇప్పటికే మంచి ప్రశంసలు అందుకుంది. కానీ, ఛత్రపతి శంబాజీ జీవితాన్ని ఆధారంగా చేసుకున్న ఈ కథకు.. ఉత్తర భారత ప్రేక్షకులలా తెలుగువారు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
కింగ్‌స్టన్
జి.వి. ప్రకాశ్ కథానాయకుడిగా, కమల్ ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ హారర్ మూవీ. ఇందులో జి.వి. ప్రకాశ్‌కు జోడిగా దివ్య భారతి నటించింది. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ
మలయాళ సినిమా అనగానే.. క్రైమ్ థ్రిల్లర్లకు పెట్టింది పేరు. అదే కోవలో జితు అశ్రఫ్ దర్శకత్వంలో.. షాహి కబీర్ రచనలో రూపొందిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ మరో సీరియస్ థ్రిల్లర్‌గా వస్తోంది. కుంచాకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూడు విభిన్న శైలుల సినిమాల్లో ఏది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Tags
- Ajith
- Pattudala
- Tamil young hero Pradeep Ranganathan
- Return of the Dragon
- Malayalam star hero Unni Mukundan
- Marco
- Surya
- Kanguva’
- Siva Karthikeyan
- Amaran’
- Aadi Pinisetty
- Shabdam
- Aghatya
- Chava
- Chhatrapati Shambhaji
- Kingston
- G.V. Prakash
- Kamal Prakash
- Divya Bharathi
- Officer on Duty
- Jeethu Ashraf
- Shahi Kabir
- Kunchacko Boban
- Priyamani
-
Home
-
Menu