ప్రభాస్ 'ఫౌజీ'లో డబుల్ ట్రీట్!

ప్రభాస్ ఫౌజీలో డబుల్ ట్రీట్!
X
రెబెల్ స్టార్ ప్రభాస్ క్రేజీ లైనప్ లో హను రాఘవపూడి చిత్రం ఒకటి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకోసం 'ఫౌజీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ హను రాఘవపూడి.

ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి నటిస్తుంది. అయితే ఇందులో ప్రభాస్ రెండు వైవిధ్యభరిత పాత్రల్లో కనిపించనున్నాడట. ఈ సినిమాలో ఎంతో కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోసం మరో నాయిక అవసరం ఉందట. ఆ రోల్ కోసం నేచురల్ బ్యూటీ సాయిపల్లవిని పరిశీలిస్తున్నాడట హను రాఘవపూడి.

ఇప్పటికే సాయి పల్లవితో 'పడి పడి లేచే మనసు' సినిమాని తెరకెక్కించాడు హను రాఘవపూడి. అలాగే హను సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అవన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రభాస్ తో నటించడానికి సాయి పల్లవి ఓ.కె. చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తంగా ప్రభాస్-సాయిపల్లవి కాంబో ఫిక్సైతే 'ఫౌజీ'కి అది మరో అట్రాక్షన్ కానుంది.

Tags

Next Story