హాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న దిశా పటాని !

హాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న దిశా పటాని !
X

బాలీవుడ్ అందాల నటీమణులు ఐశ్వర్యరాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే లాంటి వారు హాలీవుడ్ చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రియాంకా చోప్రా అనేక అమెరికన్ వెబ్ సిరీస్‌లలో సత్తాచాటి.. గ్లోబల్ స్థాయిలో ఖ్యాతిని సంపాదించుకుంది. ఇప్పుడు దిశా పటానీ హాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

ప్రస్తుతం దిశా పటానీ "డ్యూరాంగో" అనే అమెరికన్ వెబ్ సిరీస్ చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉంది. ఈ వెబ్ సిరీస్ సెట్స్‌లో మెక్సికోలో.. "ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్" ఫేమ్ టైరీస్ గిబ్సన్, నటుడు హ్యారీ గుడ్‌విన్స్‌లతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. హాలీవుడ్ లో ఇది దిశా పటానీ మొట్ట మొదటి అడుగు.

ఇటీవలే దిశా పటానీ తెలుగులో "కల్కి 2898 ఎడీ" చిత్రంలో నటించింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సీక్వెల్‌లో కూడా ఆమె కనిపించనుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖులలో దిశా ఒకరు. ఆమెకు 61 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

Tags

Next Story