పవన్ సూచనలకు దిల్ రాజు సపోర్ట్!

సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ చేసిన సూచనలను సమర్ధిస్తూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా ఓ నోట్ రిలీజ్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమ మెరుగుపడాలని, ప్రజలు మళ్లీ థియేటర్లకు రావాలని గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని దిల్ రాజు అన్నారు.
ముఖ్యంగా, థియేటర్లలో తినుబండారాలు, పానీయాల ధరలను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ఆయన అభిప్రాయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను అన్నారు. ఓటీటీకి సినిమాలు త్వరగా వెళ్తుండటంతో థియేటర్లు నష్టపోతున్నాయి కాబట్టి, ఓ సినిమా ఎన్ని రోజుల్లో ఓటీటీలోకి వెళ్లాలి అన్న అంశంపై పరిశ్రమమంతా ఒకమాటగా నిర్ణయం తీసుకోవాలి అని తన నోట్ లో తెలిపారు.
ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాక, ఫిలిం ఛాంబర్ ద్వారా సంప్రదించాలని పవన్ కళ్యాణ్ చేసిన సూచన బాగుందని.. ఈ దిశగా ముందడుగు వేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. అలాగే థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ప్రధాన కారణం పైరసీ. దీన్ని సమూహంగా ఎదుర్కొంటేనే పరిశ్రమను నిలబెట్టగలుగుతాము. తెలుగు సినిమాను బలోపేతం చేయాలంటే, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవడం అవసరం అని తన నోట్ లో తెలిపారు.
Thank you Hon’ble AP Deputy CM Shri @PawanKalyan garu for your valuable suggestions and proactive steps towards the welfare of the Telugu Film Industry. pic.twitter.com/NA19194XV8
— Sri Venkateswara Creations (@SVC_official) May 27, 2025
-
Home
-
Menu