'ఎంపురాన్'కి దిల్‌రాజు సపోర్ట్!

ఎంపురాన్కి దిల్‌రాజు సపోర్ట్!
X
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా మరో భారీ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘L2: ఎంపురాన్’ మార్చి 27న గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇది 2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా రూపొందింది. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌లపై భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో మోహన్‌లాల్ ‘ఖురేషి-అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లి’గా మరోసారి ఆకట్టుకోబోతున్నాడు. ఇతర కీలక పాత్రల్లో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియర్, సూరజ్ వెంజరమూడు, సచిన్ ఖేడేకర్ వంటి వారు కనిపించనున్నారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

‘ఎంపురాన్’ టీజర్, ప్రమోషనల్ కంటెంట్ చూస్తే హాలీవుడ్ స్థాయిలో హై ఆక్టేన్ యాక్షన్, స్టైలిష్ ప్రజెంటేషన్ కనిపిస్తోంది. మరి.. పాన్ ఇండియా లెవెల్ లో 'ఎంపురాన్' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Tags

Next Story