కొత్త టాలెంట్ కోసం దిల్ రాజు డ్రీమ్స్

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ ప్రత్యేక వేదికను ప్రారంభించారు. ‘దిల్ రాజు డ్రీమ్స్’ పేరుతో సంస్థను తీసుకొచ్చారు. ఈ ఈవెంట్‌కి హీరో విజయ్ దేవరకొండ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్‌సైట్‌ను లాంఛ్ చేశారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, సినిమా రంగంలోకి రావాలనుకునే ప్రతిభావంతులకు సరైన అవగాహన, మార్గనిర్దేశం ఇవ్వడమే ఈ వేదిక ఉద్దేశమన్నారు. 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ తమకున్న విధానాల్లోనే నడుస్తున్నాయి. కానీ కొత్త టాలెంట్ కోసం పూర్తి స్థాయిలో ప్రత్యేక వేదిక అవసరమవ్వడమే ఈ ‘దిల్ రాజు డ్రీమ్స్’ ఆవిర్భావానికి కారణం,' అని చెప్పారు.
ఈ వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకున్న అప్లికేషన్లను ప్రత్యేక బృందం పరిశీలించి, నైపుణ్యం ఉన్నవారిని ఎంపిక చేస్తారని చెప్పారు. రిజెక్ట్ అయిన వారు నిరాశ చెందకుండా, తమ ప్రతిభను మెరుగుపరచుకోవాలని సూచించారు. తమ 30 ఏళ్ల అనుభవంతో కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ‘దిల్ రాజు డ్రీమ్స్’ సంస్థను ప్రారంభించామన్న దిల్ రాజు, ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా దర్శకత్వం, నటన, సంగీతం, రచనతో పాటు నిర్మాతగా మారాలనుకునే వారికీ చేస్తామని గైడెన్స్ చేస్తామని తెలిపారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, 'కొత్త వాళ్లకి ఒక అవకాశం ఎంత విలువైందో నాకు తెలుసు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ కోసం 16 వేల అప్లికేషన్లలో నన్ను ఎంపిక చేయడం నా జీవితాన్ని మార్చేసింది' అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ 'మన కలల్ని మనమే నమ్మాలి. మన లక్ష్యాన్ని మనమే ముందుకు తీసుకెళ్లాలి' అని చెప్పారు.
-
Home
-
Menu