దృశ్యం 3: మళ్లీ తెరపైకి జార్జ్‌కుట్టి కథ!

దృశ్యం 3: మళ్లీ తెరపైకి జార్జ్‌కుట్టి కథ!
X

మలయాళ సూపర్ హిట్ 'దృశ్యం' సిరీస్ ప్రేమికులకు ఉత్సాహకరమైన వార్త. దృశ్యం 3 ఫ్రాంచైజీలోని మూడో భాగం అధికారికంగా ప్రకటించారు. అయితే, నటీనటులు, విడుదల తేదీ గురించి వివరాలు ఇంకా వెల్లడించలేదు.

మోహన్‌లాల్ తన సోషల్ మీడియా ఖాతాలో, "గతం ఎప్పుడూ మౌనంగా ఉండదు... దృశ్యం 3 ఖాయం!" అంటూ ప్రకటించారు. దీనికి తోడు, దర్శకుడు జీతూ జోసఫ్, నిర్మాత ఆంటోని పెరుంబవూర్తో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. జీతూ జోసఫ్ దర్శకత్వం వహించిన దృశ్యం ఫ్రాంచైజీ భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన థ్రిల్లర్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఇందులో ఆకట్టుకునే కథనంతోపాటు ఊహించని మలుపులు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి.

2013లో విడుదలైన మొదటి భాగం దృశ్యం మలయాళ చిత్ర పరిశ్రమలో మార్గదర్శకంగా నిలిచింది. కుటుంబ కథతో కలిసిన క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా, అనుకోకుండా జరిగిన ఒక నేరాన్ని దాచిపెట్టడానికి ఓ సామాన్యుడు జార్జ్ కుట్టి ఎంతవరకు వెళ్ళగలడో చూపించింది. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషల్లో రీమేక్ అయ్యింది.

2021లో విడుదలైన దృశ్యం 2’ ఈ కథను మరింత ఉత్కంఠభరితంగా ముందుకు తీసుకువెళ్లింది. మొదటి భాగం సంఘటనల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత జరిగే ఈ కథలో, జార్జ్‌కుట్టి థియేటర్ యజమానిగా మారిపోతాడు. అయితే, కేసును మళ్లీ తెరవడంతో అతను తన కుటుంబ రహస్యాన్ని కాపాడుకోవడానికి మరోసారి తన తెలివితేటలతో పోలీసులను మోసగించాల్సి వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలైన ఈ చిత్రం, అద్భుతమైన రచన, ఊహించని మలుపుల కారణంగా విశేష ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు దృశ్యం 3 కూడా ఇదే ఉత్కంఠను కొనసాగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు!

Tags

Next Story