క్లైమాక్స్ మార్పుపై ధనుష్ ఆవేదన

క్లైమాక్స్ మార్పుపై ధనుష్ ఆవేదన
X
ధనుష్, సోనమ్ కపూర్ జంటగా, ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో రూపొందిన ‘రాంఝానా’ చిత్రం 2013లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది.

ధనుష్, సోనమ్ కపూర్ జంటగా, ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో రూపొందిన ‘రాంఝానా’ చిత్రం 2013లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా రీ రిలీజ్ వెర్షన్ కి క్లైమాక్స్ లో మార్పులు చేశారు.

AI టెక్నాలజీ సహాయంతో ఒరిజినల్ వెర్షన్‌లో హీరో మరణించే ఎమోషనల్ ఎండ్‌ను తొలగించి, హ్యాపీ ఎండింగ్ జతచేశారు. ఈ మార్పులపై ధనుష్ తీవ్రంగా స్పందించాడు. 'AI‌తో రూపొందించిన క్లైమాక్స్‌ సినిమా ఆత్మను చంపేసింది. మేము అభ్యంతరం తెలిపినా, మా అనుమతి లేకుండానే ఈ మార్పులు చేశారు. ఇది నేను 12 ఏళ్ల క్రితం కమిట్‌ అయిన సినిమా కాదు. ఈ విధంగా సినిమాల కంటెంట్‌ను మార్చడం కళ, కళాకారుల్ని బాధించే పని. ఇలాంటి పద్ధతులను నిరోధించేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలి' అని తన పోస్ట్‌లో తెలిపాడు ధనుష్.



Tags

Next Story