ఐదోసారి ధనుష్-వెట్రిమారన్ కాంబో!

కోలీవుడ్ హిట్ కాంబో మళ్లీ రిపీటవుతోంది. ధనుష్-వెట్రిమారన్ మరోసారి కలసి పనిచేయనున్నారు. గతంలో వీరి కలయికలో ‘పొల్లాధవన్, ఆడుకాలం, వడ చెన్నై, అసురన్’ సినిమాలు వచ్చాయి. ఈ అన్ని చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. అంతేకాకుండా ఈ సినిమాలకు గానూ ధనుష్ రెండుసార్లు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నాడు. వెట్రిమారన్ సైతం పలు జాతీయ అవార్డులు కొల్లగట్టాడు.
ఇప్పుడు ధనుష్-వెట్రిమారన్ కలయికలో ఐదో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆర్ ఇన్ఫోటైన్‌మెంట్ సంస్థ నిర్మించనుంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ఈ ప్రకటనను సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసింది.
మరోవైపు ఇటీవలే వెట్రిమారన్ 'విడుదల పార్ట్ 2' ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ధనుష్ సైతం 'కుబేర, ఇడ్లీ వడై' వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. వెట్రిమారన్ కథల ఎంపికలో తన ప్రత్యేకతతో ప్రశంసలు అందుకుంటుండగా, ధనుష్ తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. వీరిద్దరి కలయికలో రాబోయే ఐదో సినిమా ఎలా ఉంటుంది? అనే ఆసక్తి మొదలైంది.
-
Home
-
Menu