ధనుష్ తెలుగు ప్రమోషన్స్ షురూ

ధనుష్ తెలుగు ప్రమోషన్స్ షురూ
X
తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ రూరల్ ఎంటర్టైనర్‌లో ధనుష్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుంది.

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ రూరల్ ఎంటర్టైనర్‌లో ధనుష్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుంది. ఈ సినిమాలో ధనుష్ గ్రామీణ యువకుడిగా, నిత్యా మీనన్ అతని భార్యగా కనిపించనున్నారు. అరుణ్ విజయ్, రాజ్ కిరణ్, సముద్రఖని, షాలినీ పాండే వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో ‘ఇడ్లీ కొట్టు‘ పేరుతో విడుదలవుతోన్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజయ్యింది.

జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతంలో సామ్రాట్ నాయుడు రాసిన ఈ పాటను కృష్ణ తేజస్వి, శ్వేతా మోహన్ ఆలపించారు. ధనుష్, నిత్యా మీనన్ మధ్య అందమైన మాంటేజెస్ తో చిత్రీకరించిన ఈ పాట ఎంతో మెలోడియస్ గా ఆకట్టుకుంటుంది. ‘ఇడ్లీ కొట్టు‘ చిత్రం అక్టోబర్ 1న విడుదలకు ముస్తాబవుతుంది. మొత్తంగా.. ‘కుబేర‘ వంటి సూపర్ హిట్ తర్వాత ధనుష్ నుంచి వస్తోన్న ‘ఇడ్లీ కొట్టు‘ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.



Tags

Next Story