ధనుష్, నిత్యా కెమిస్ట్రీ అదుర్స్!

ధనుష్, నిత్యా కెమిస్ట్రీ అదుర్స్!
X
తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఇడ్లీ కడై’. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ రూరల్ ఎంటర్టైనర్‌లో ధనుష్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుంది.

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఇడ్లీ కడై’. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ రూరల్ ఎంటర్టైనర్‌లో ధనుష్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుంది. ఈ సినిమాలో ధనుష్ గ్రామీణ యువకుడిగా, నిత్యా మీనన్ అతని భార్యగా కనిపించనున్నారు. జీవనోపాధిగా ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు) నడిపించే ఈ వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లు, భావోద్వేగాలు, కుటుంబానుబంధాలను ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నట్టు తెలుస్తోంది.

ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజయ్యింది. ఈ పాటలో భార్యాభర్తలుగా ధనుష్, నిత్యామేనన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఈ పాటను ధనుష్ స్వయంగా రాసి ఆలపించడం మరో విశేషం. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, సముద్రఖని, షాలినీ పాండే, అరుణ్ విజయ్, రాజ్ కిరణ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 1న 'ఇడ్లీ కడై' ఆడియన్స్ ముందుకు రానుంది.

Tags

Next Story