ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ధనుష్ 54!

ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ధనుష్ 54!
X
కోలీవుడ్ స్టార్ ధనుష్ సినిమాల స్పీడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ తరం అగ్ర కథానాయకులలో జెట్ స్పీడులో సినిమాలు చేయడంలో ధనుష్ దిట్ట.

కోలీవుడ్ స్టార్ ధనుష్ సినిమాల స్పీడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ తరం అగ్ర కథానాయకులలో జెట్ స్పీడులో సినిమాలు చేయడంలో ధనుష్ దిట్ట. ఇటీవల ‘కుబేర‘తో సూపర్ హిట్ అందుకున్న ధనుష్.. ఇప్పటికే తన డైరెక్షన్ లో ‘ఇడ్లీ కడై‘ను పూర్తి చేశాడు. త్వరలో ‘ఇడ్లీ కడై‘ రిలీజ్ కాబోతుంది. అలాగే బాలీవుడ్ లో ‘తేరే ఇష్క్ మే‘ సినిమాలోనూ నటిస్తున్నాడు.

లేటెస్ట్ గా తన 54వ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ‘D54’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘పోర్ తొళిల్‘ వంటి థ్రిల్లర్‌ను రూపొందించిన విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈరోజు విడుదలైన ఈ మూవీ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. పత్తి పంట కాలిపోతున్న నేపథ్యంలో నిలబడి ఉన్న ధనుష్‌ రూపాన్ని చూపిస్తూ వచ్చిన ఈ పోస్టర్, సినిమాలో ఆయన రైతు పాత్రలో కనిపించనున్నాడనే సంకేతాలను ఇస్తోంది.

గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టుకుంది. ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా.. జయరామ్, సూరజ్ వెంజరమూడు, కె.ఎస్. రవికుమార్, కరుణాస్, పృథ్వీ పాండిరాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, థింక్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.



Tags

Next Story