‘జటాధర‘ నుంచి ధన పిశాచి సాంగ్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర‘. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతుంది.
దసరా పండగ కానుకగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘ధన పిశాచి‘ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలో సోనాక్షి ఉగ్రరూపంలో కనిపించి, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది. సమీర కొప్పికర్ స్వరపరిచిన ఈ హిందీ సాంగ్ ను మధుబంతి బాగ్చి ఆలపించారు.
ఈ చిత్రంలో సుధీర్ బాబు గతంలో ఎన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. శిల్పా శిరోద్కర్, దివ్యా ఖోస్లా, ఇందిరా కృష్ణ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. జీ స్టూడియోస్ బ్యానర్ పై ప్రేరణ అరోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
-
Home
-
Menu