‘కాంతార‘ నుంచి డివోషనల్ సాంగ్

‘కాంతార‘ నుంచి డివోషనల్ సాంగ్
X
‘కాంతార’ చిత్రంలోని ‘వరాహ రూపం..’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ పాట ఎక్కడో ఓ చోట ప్లే అవుతూనే ఉంటుంది.

‘కాంతార’ చిత్రంలోని ‘వరాహ రూపం..’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ పాట ఎక్కడో ఓ చోట ప్లే అవుతూనే ఉంటుంది. ఆ పాట తరహాలో ఇప్పుడు ‘కాంతార: చాప్టర్ 1’లోనూ ఓ పాట ఉంది. ‘బ్రహ్మ కలశ’ అంటూ సాగే ఈ గీతాన్ని విడుదల చేసింది టీమ్. అజనీష్ లోక్‌నాథ్ సంగీతంలో కృష్ణకాంత్ రాసిన ఈ పాటను అబ్బి వి ఆలపించారు.

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఈ మూవీలో రిషబ్ కి జోడీగా రుక్మిణి వసంత్ నటించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం వంటి పలు భాషల్లో దసరా కానుకగా అక్టోబర్ 2న ‘కాంతార.. చాప్టర్ 1‘ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈరోజు ఈ చిత్రం తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు.



Tags

Next Story