రణబీర్ 'ధూమ్ 4' షూటింగ్ డీటెయిల్స్ ఇవే!

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ వచ్చే కొన్ని సంవత్సరాల్లో చాలా బిజీగా ఉండబోతున్నాడు. ప్రస్తుతం అతడు ఇండియాలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ అండ్ వార్ చిత్రం లోనూ, అలాగే నితేశ్ తివారీ దర్శకత్వంలోని రామాయణం (రెండు భాగాలు) షూటింగ్‌లోను పాల్గొంటున్నాడు . ఈ రెండు చిత్రాలు 2026లో విడుదల కానున్నాయి. ఇటీవల రణబీర్ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకమైన ధూమ్ 4 లో హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే.
దాదాపు పదేళ్ల క్రితమే అధికారికంగా ఈ సినిమాను ప్రకటించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. కానీ ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర షూటింగ్ 2026 ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది.
తాజా సమాచారం ప్రకారం, 'ధూమ్ 4' కోసం ప్రస్తుతం ఇద్దరు కథానాయికలతో పాటు ప్రతినాయక పాత్ర కోసం ఆడిషన్లు జరుగుతున్నాయి. ఈ ప్రతినాయక పాత్రకు సౌత్ ఇండస్ట్రీ నుండి ప్రముఖులను పరిశీలిస్తున్నారు. రణబీర్ లవ్ అండ్ వార్, రామాయణం చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే 'ధూమ్ 4' షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తోంది, ఎందుకంటే ఈ చిత్రానికి రణబీర్ కొత్త మేకోవర్ చేయాల్సి ఉంటుంది. గత ధూమ్ సినిమాల్లో ప్రధాన పాత్రలు యాంటీ-హీరో క్వాలిటీస్ కలిగి ఉండేవి. కానీ తాజా నివేదిక ప్రకారం, ఈ సినిమాలో రణబీర్ పాత్ర పూర్తిగా భిన్నంగా ఉండనుంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఇందులో మరింత స్పష్టత వస్తుంది.
-
Home
-
Menu