రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం

రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం
X

ప్రముఖ నటుడు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) కన్నుమూశారు.. వృద్ధాప్య కారణాల వల్ల అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో రవితేజ ఇంట్లో విషాదం అలముకుంది.




తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన రాజగోపాల్ రాజు ఫార్మాసిస్ట్‌గా ఉత్తర భారతదేశంలో పనిచేశారు. వృత్తి రీత్యా జైపూర్, ఢిల్లీ, ముంబయి, భోపాల్ వంటి నగరాల్లో ఎక్కువకాలం గడిపారు. రవితేజ చదువు ఆయా రాష్ట్రాల్లో కొనసాగడంతో ఆయన పలు భాషలపై పట్టు సంపాదించారు. ఈ ప్రత్యేకతే నటుడిగా రవితేజకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది.

రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు. వారిలో రవితేజ పెద్దవారు. రెండో కుమారుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో మరణించగా, మూడో కుమారుడు రఘు కూడా నటుడిగా పలు సినిమాల్లో నటించారు.

ఈ విషాదకర ఘటనపై మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. “వాల్తేరు వీరయ్య సెట్లో చివరిసారి ఆయనను కలిశాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ చిరంజీవి సంతాపం తెలిపారు. ఇతర ప్రముఖులు కూడా రవితేజ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Tags

Next Story