హైదరాబాద్‌లో వార్నర్ సందడి!

హైదరాబాద్‌లో వార్నర్ సందడి!
X
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాబిన్ హుడ్‘ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాబిన్ హుడ్‘ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్, సాంగ్స్ భారీ స్పందన పొందగా, సినిమా ప్రమోషన్లు మరింత ఊపందుకున్నాయి.

లేటెస్ట్ గా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్‌లో జాయిన్ కావడం ఆసక్తికరంగా మారింది. గతంలో తెలుగు సినిమాలపై తన ఆసక్తిని పలుమార్లు వ్యక్తం చేసిన వార్నర్, ఇప్పుడు ‘రాబిన్ హుడ్‘లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా డేవిడ్ వార్నర్ హైదరాబాద్ చేరుకున్నాడు.

ఇక అభిమానులంతా ఎదురుచూస్తున్న ‘రాబిన్ హుడ్‘ ట్రైలర్ లాంఛ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం జరగబోతుంది. ఈ ఈవెంట్‌లో చిత్రబృందంతో పాటు డేవిడ్ వార్నర్ కూడా హాజరవ్వనున్నాడు.

Tags

Next Story