'ఘాటి' నుంచి 'దస్సోరా' సాంగ్

ఘాటి నుంచి దస్సోరా సాంగ్
X
స్వీటీ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'ఘాటి'. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకు వస్తోంది.

స్వీటీ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'ఘాటి'. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ప్రచారంలో స్పీడు పెంచారు మేకర్స్. లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి 'దస్సోరా దస్సోరా' అంటూ సాగే 'ఘాటి' టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.

సాగర్ నాగవెల్లి సంగీతంలో ఈఎస్ మూర్తి రాసిన ఈ పాటను గీతా మాధురి, సాకేత్ కొమండూరి, శ్రుతి రంజని ఆలపించారు. సినిమా థీమ్ ను తెలియజేసేలా సాగిన ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ లిరికల్ వీడియోలో చూపించిన యాక్షన్ సన్నివేశాలు, బీటీఎస్‌ క్లిప్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ చిత్రంలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు అనుష్కకి జోడీగా నటించాడు. జగపతిబాబు, చైతన్యరావు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌, పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.




Tags

Next Story