‘డాకు మహారాజ్‘ సెలబ్రేషన్స్ కు జోరుగా ఏర్పాట్లు!

ఈ రోజు సాయంత్రం అనంతపురంలో ‘డాకు మహారాజ్‘ సినిమా సక్సెస్ మీట్ అట్టహాసంగా జరగనుంది. ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్ లో సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. ఈ సక్సెస్ మీట్ కు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణతో పాటు హీరోయిన్లు ప్రగ్య జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఇతర కీలక నటులు హాజరుకానున్నారు.
‘పుష్ప 2‘ ఇన్సిడెంట్ తర్వాత సినిమా కార్యక్రమాల విషయంలో నిర్వహకులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘డాకు మహారాజ్‘ సక్సెస్ మీట్ కు సైతం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. అలాగే పాసులు ఉన్నవారికి మాత్రమే కార్యక్రమ ప్రాంగణంలో ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వేడుకకు హాజరయ్యే అభిమానులు సాయంత్రం 5 గంటల లోపే వెన్యూ చేరుకోవాలని సూచించారు.
‘డాకు మహారాజ్‘ విజయాన్ని పురస్కరించుకుని అభిమానులు ఈ సక్సెస్ మీట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, మరియు సాంకేతిక ఏర్పాట్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు అనంతపురం ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయబడింది. భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది భద్రతా చర్యలు తీసుకున్నారు.
-
Home
-
Menu