అనంతపురంలో ‘డాకు మహారాజ్‘ సక్సెస్ మీట్?

X
సంక్రాంతి బరిలో విడుదలైన ‘డాకు మహారాజ్‘ సంచలన విజయాన్ని సాధించింది. సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో అనంతపురంలో సక్సెస్ మీట్ ను నిర్వహించడానికి సిద్ధమవుతోంది టీమ్.
సంక్రాంతి బరిలో విడుదలైన ‘డాకు మహారాజ్‘ సంచలన విజయాన్ని సాధించింది. ఈ మూవీతో వరుసగా నాల్గవ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. ‘డాకు మహారాజ్‘ సినిమా విడుదలైన 8 రోజులకు రూ.156 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద రన్ స్ట్రాంగ్ గానే కొనసాగుతుంది.
‘డాకు మహారాజ్‘ విడుదలకు ముందు అమెరికాలో ఓ ఈవెంట్ ను నిర్వహించారు. అలాగే అనంతపురంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిద్దామనుకున్నారు. కానీ అనివార్య కారణాల వలన ఆ ఈవెంట్ రద్దయ్యింది. అయితే సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో అనంతపురంలోనే ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించడానికి సిద్ధమవుతోంది టీమ్.
జనవరి 22న అనంతపురంలో ‘డాకు మహారాజ్‘ సక్సెస్ మీట్ కు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ ఈవెంట్ లో బాలయ్యతో పాటు చిత్రబృందం అంతా పాల్గొనబోతుందని తెలుస్తోంది.
Next Story
-
Home
-
Menu