రవితేజ ‘మాస్ జాతర‘ నుంచి క్రేజీ అప్డేట్!

X
మాస్ మహారాజ రవితేజ సినిమా అంటేనే ఫ్యాన్స్ కు మాస్ జాతర. ఇప్పుడు అదే టైటిల్ తో రవితేజ సినిమా వస్తోంది. ఈ మూవీ నుంచి జనవరి 26న రవితేజ బర్త్ డే స్పెషల్ గా ఓ మాస్ ర్యాంపేజ్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతుంది టీమ్.
మాస్ మహారాజ రవితేజ సినిమా అంటేనే ఫ్యాన్స్ కు మాస్ జాతర. ఇప్పుడు అదే టైటిల్ తో రవితేజ సినిమా వస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో రూపొందుతున్న ఈ మూవీ నుంచి జనవరి 26న రవితేజ బర్త్ డే స్పెషల్ గా ఓ మాస్ ర్యాంపేజ్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతుంది టీమ్. అందుకు సంబంధించి అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇచ్చింది నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్.
రవితేజ 75వ చిత్రంగా రూపొందుతున్న ‘మాస్ జాతర‘ను భాను భోగారపు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రవితేజకి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ‘ధమాకా‘ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న మూవీ ఇది. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మే 9న ‘మాస్ జాతర‘ విడుదలకు ముస్తాబవుతుంది.
Next Story
-
Home
-
Menu