2025 లో ఈ క్రేజీ హీరోలు అసలు కనిపించరు !

2025 సినిమా సీజన్ మొదటి విడత రిలీజెస్ ‘గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి చిత్రాలతో ప్రారంభమయింది. ఫిబ్రవరిలో మధ్యస్థాయి బడ్జెట్ చిత్రాలు లేదా యువ నటులతో కూడిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వేసవి సీజన్లో భారీ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ఈ సంవత్సరం విడుదల కాబోయే సినిమాల్లో ఎవరెవరు నటిస్తారో కూడా స్పష్టమవుతోంది. 2025లో అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలు ఉండవు అనేది స్పష్టమైంది. మరింతగా చెప్పాలంటే.. మహేష్ బాబు 2026లో కూడా సినిమా చేయడం లేదు. వీరిద్దరూ అత్యంత భారీ బడ్జెట్ సినిమాలల్లో నటిస్తున్నారు. ఇవి పూర్తవడానికి కనీసం రెండేళ్లు పడుతుంది.
మహేష్ బాబు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే పాన్ వరల్డ్ యాక్షన్ ఎడ్వెంచర్ చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది. ఇక మరోవైపు, అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చిత్రీకరణను ఈ వేసవిలో ప్రారంభించనున్నారు. నిర్మాత నాగ వంశీ అంచనా ప్రకారం.. ఈ సినిమా పూర్తయ్యేందుకు కనీసం ఒకటిన్నర సంవత్సరం పట్టవచ్చు.
ఎన్టీఆర్‌కు కూడా ఈ ఏడాది తెలుగులో సినిమా లేదు. అయితే.. అతడి తొలి హిందీ చిత్రం “వార్ 2” మాత్రం 2025లో విడుదల కానుంది. రామ్ చరణ్ నటించబోయే స్పోర్ట్స్ డ్రామా చిత్రం “ఆర్‌సి 16” ను 2025 చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
-
Home
-
Menu