'కింగ్‌డమ్' ఆడియో రైట్స్ కి క్రేజీ ఆఫర్!

'కింగ్‌డమ్' ఆడియో రైట్స్ కి క్రేజీ ఆఫర్!రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్‌డమ్'పై ప్రేమికుల్లో భారీ అంచనాలున్నాయి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి గ్రాండ్ స్కేల్‌లో పీరియాడిక్ స్టోరీగా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'కింగ్‌డమ్' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుందట. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. మార్చి మొదటి వారం నాటికి చిత్రీకరణ పూర్తవుతుందని, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేసి మే 30న పాన్ ఇండియా స్థాయిలో 'కింగ్‌డమ్'ను గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
ఈ చిత్రానికి కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. భారీ మొత్తానికి ఈ సినిమా ఆడియో రైట్స్ ను సొంతం చేసుకుందట ఆదిత్య మ్యూజిక్. మొత్తంగా కల్ట్ హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ కి 'కింగ్‌డమ్' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
-
Home
-
Menu