బాలకృష్ణ-మలినేని కోసం క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్!

బాలకృష్ణ-మలినేని కోసం క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్!
X
'వీరసింహారెడ్డి' విజయం తర్వాత బాలకృష్ణ-మలినేని మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. ఈ మూవీకోసం మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ను తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది.

నటసింహం బాలకృష్ణ తన విజయ పరంపరను మరింత ముందుకు దూసుకెళ్లే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఈ సంక్రాంతి బరిలో 'డాకు మహారాజ్'తో బడా హిట్ అందుకున్న బాలయ్య.. ఈ సంవత్సరం దసరా కానుకగా 'అఖండ 2'ని తీసుకొస్తున్నాడు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలను లైన్లో పెడుతున్నాడట బాలయ్య.


ముందుగా తనకు 'వీరసింహారెడ్డి' వంటి విజయాన్నందించిన మలినేని గోపీచంద్ తో మరో మూవీకి కమిట్ అయ్యాడట బాలకృష్ణ. వీరిద్దరి కాంబో మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈసారి నటసింహం ను మరో లెవెల్ లో చూపించేందుకు మలినేని స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట.


బాలకృష్ణ-మలినేని గోపీచంద్ మూవీకోసం మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ను తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. తన మ్యూజికల్ మ్యాజిక్ తో హీరోలకు ఓ రేంజులో ఎలివేషన్స్ ఇవ్వడంలో అనిరుధ్ దిట్ట. 'విక్రమ్' సినిమాలో కమల్ హాసన్, 'జైలర్'లో రజనీకాంత్ ఎలివేషన్స్ అందుకు నిదర్శనం. ఎన్టీఆర్ 'దేవర' కోసం అనిరుధ్ కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి అప్లాజ్ వచ్చింది. మొత్తంగా.. త్వరలోనే బాలకృష్ణ-మలినేని గోపీచంద్ కాంబోపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.


Tags

Next Story