రెండు రోజుల్లోనే లాభాల్లోకి ‘కోర్ట్’

కమర్షియల్ సినిమాలకే పెద్ద పీట వేసే తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ కి కనెక్ట్ అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రూపొందిన కోర్ట్ డ్రామా ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది.కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం పెట్టుబడిని తిరిగి రాబట్టిందంటున్నారు.
రామ్ జగదీష్ దర్శకత్వంలో పోక్సో కేసు నేపథ్యంలో నడిచే కోర్ట్ డ్రామాగా ఇది రూపొందింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ మొదటి రోజునే రూ. 8.10 కోట్లు గ్రాస్ వసూలు చేయగా, రెండో రోజు రూ. 7.80 కోట్లు కలెక్షన్ సాధించింది. మొత్తం రెండు రోజుల్లో రూ. 15.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే ఓటీటీ రైట్స్, ఆడియో హక్కుల విక్రయం ద్వారా మంచి లాభాలను సాధించింది. ఆదివారం కలెక్షన్లు కూడా కలుపుకుంటే.. వీకెండ్ కే ‘కోర్ట్‘ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలున్నాయి.
-
Home
-
Menu