బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సత్తా

బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సత్తా
X
ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన కోర్ట్ డ్రామా ‘కోర్ట్‘. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ సినిమా అంచనాలకు మించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన కోర్ట్ డ్రామా ‘కోర్ట్‘. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ సినిమా అంచనాలకు మించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సరికొత్త కథనంతో, ఆసక్తికరమైన కోర్ట్ రూమ్ డ్రామాతో ఈ సినిమా తొలి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది.

ప్రత్యేకంగా ప్రియదర్శి కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ నమోదు చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. వీకెండ్ మాత్రమే కాకుండా వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రం తన జోరును కొనసాగిస్తుంది. మొత్తంగా ఐదు రోజులకు గానూ ‘కోర్ట్‘ ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించినట్టు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

Tags

Next Story