‘కోర్ట్‘.. బిహైండ్ ది క్యారెక్టర్స్ లిస్ట్!

‘కోర్ట్‘.. బిహైండ్ ది క్యారెక్టర్స్ లిస్ట్!
X
ఈమధ్య కాలంలో తెలుగులో కూడా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ పెరిగాయి. వాస్తవ సంఘటనలను ప్రేరణగా తీసుకుని వాటిని సినిమాలుగా మలుస్తున్నారు.

ఈమధ్య కాలంలో తెలుగులో కూడా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ పెరిగాయి. వాస్తవ సంఘటనలను ప్రేరణగా తీసుకుని వాటిని సినిమాలుగా మలుస్తున్నారు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ‘కోర్ట్‘ చిత్రం ఆ కోవలోకే వస్తోంది. ‘కోర్ట్‘.. ‘ స్టేట్ వర్సెస్ నోబడీ‘ అనే ట్యాగ్ లైన్ తో ఈ మూవీ వస్తోంది.

ఆద్యంతం కోర్ట్ డ్రామాగా రామ్ జగదీష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 14న విడుదలకు ముస్తాబవుతోన్న ‘కోర్ట్‘ ప్రచారంలో స్పీడు పెంచింది టీమ్. ఈ మూవీ నుంచి వరుసగా వ్యాల్యూమ్స్ పేరుతో క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తున్నారు. ఈ వీడియోలను చూస్తుంటే సినిమాలోని ప్రతీ పాత్రను దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.






Tags

Next Story