'పెద్ది' గ్లింప్స్ కోసం కౌంట్‌డౌన్!

పెద్ది గ్లింప్స్ కోసం కౌంట్‌డౌన్!
X
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ 'పెద్ది'పై ఆసక్తి పెరుగుతుంది. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా.. ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్ పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ 'పెద్ది'పై ఆసక్తి పెరుగుతుంది. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా.. ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్ పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రిల్ 6న శ్రీరామనవమి కానుకగా విడుదలయ్యే 'పెద్ది' గ్లింప్స్ రిలీజ్ టైమ్ పై తాజాగా క్లారిటీ వచ్చింది.

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ఈ మూవీ ‘ఫస్ట్ షాట్’ గ్లింప్స్ మిక్సింగ్‌ను పూర్తి చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఏప్రిల్ 6న ఉదయం 11:45 గంటలకు ఈ మాస్ గ్లింప్స్ విడుదల కానుంది. 'పెద్ది' సినిమా ఆద్యంతం గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుంది. రామ్ చరణ్ ఎనర్జీ, బుచ్చిబాబు మార్క్ ఎమోషన్, ఏఆర్ రెహ్మాన్ సంగీతం 'పెద్ది'ని పెద్ద హిట్ చేస్తాయనే నమ్మకంతో ఉన్నారు మెగా ఫ్యాన్స్.

https://x.com/vriddhicinemas/status/1908153905344577547

Tags

Next Story