'కూలీ' ట్రైలర్ డేట్ ఫిక్స్!

కూలీ ట్రైలర్ డేట్ ఫిక్స్!
X
సూపర్ స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ మూవీ 'కూలీ' నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ మూవీ 'కూలీ' నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్టు 2న విడుదల చేయనున్నట్టు సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. ట్రైలర్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో కింగ్ నాగార్జున తొలిసారి ఓ పవర్‌ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇంకా.. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కేమియోలో మెరవనుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళీ స్టార్ సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ తో పాటు.. పలు భాషలకు సంబంధించిన అగ్ర నటులు నటించడంతో పాన్ ఇండియా లెవెల్ లో 'కూలీ'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆగస్టు 14న 'కూలీ' రిలీజ్ కు రెడీ అవుతుంది.



Tags

Next Story