ఆంధ్రప్రదేశ్ లో 'కూలీ' టికెట్ రేట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ లో కూలీ టికెట్ రేట్లు పెంపు
X
సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' సినిమాకు ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 14న విడుదల రోజు ఉదయం 5 గంటలకు ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వడంతో పాటు, టికెట్ రేట్లు 10 రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' సినిమాకు ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 14న విడుదల రోజు ఉదయం 5 గంటలకు ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వడంతో పాటు, టికెట్ రేట్లు 10 రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు జారీ చేసిన జీవో ప్రకారం, సింగిల్ స్క్రీన్‌లలో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు (జీఎస్టీ సహా).

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్ వంటి వారు నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న 'కూలీ' ఆగస్టు 14 నుంచి బాక్సాఫీస్‌ను కుదిపేయడానికి సిద్ధమవుతోంది.

Tags

Next Story