'కూలీ' థర్డ్ సింగిల్ వెన్యూ ఫిక్స్!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ పాన్-ఇండియా మూవీలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు 'చికిటు, మోనిక' వచ్చాయి. వీటిలో 'మోనిక' సాంగ్ అయితే ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో.. 'కూలీ' నుంచి మరో పాట కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. లేటెస్ట్ గా 'కూలీ' థర్డ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చింది సన్ పిక్చర్స్.
'కూలీ' మూడో పాటను హైదరాబాద్ లోనే విడుదల చేయబోతున్నారు. జూలై 22న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన ఈ సాంగ్ ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది టీమ్. ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు.. కింగ్ నాగార్జున కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారట. 'కూలీ' చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేస్తుంది.
Brace yourselves!🔥 The #Coolie third single #PowerHouse - Song launch event is happening at Quake Arena, Hyderabad on July 22 at 9:30 PM! 💥😎#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @shrutihaasan @Arivubeing… pic.twitter.com/vfV9Do5FWm
— Sun Pictures (@sunpictures) July 17, 2025
-
Home
-
Menu