'కూలీ' షూటింగ్ కంప్లీట్!

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' షూటింగ్ పూర్తయింది. మేకర్స్ ఈ అప్‌డేట్‌ను స్పెషల్ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో రజనీకాంత్, నాగార్జున, సత్యరాజ్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ వంటి నటుల గ్లింప్స్ కనిపించాయి.
బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ చిత్రం రాబోతుంది. రజనీకాంత్ మెయిన్ లీడ్ కాగా.. పలు భాషలకు సంబంధించిన నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రుతిహాసన్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో మెరవబోతుంది.
అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయినందున, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
-
Home
-
Menu