‘కూలీ‘ ప్రమోషన్స్ షురూ

తమిళ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'కూలీ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్ కీలక పాత్రలు పోషించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మురిపించబోతుంది. అనిరుధ్ సంగీతంలో ఇప్పటికే ‘కూలీ‘ నుంచి ఫస్ట్ సింగిల్ ‘చికిటు‘ రిలీజవ్వగా.. పూజా హెగ్డే చేసిన స్పెషల్ నంబర్ రిలీజ్ కు రెడీ అవుతుంది.
‘కూలీ‘ తెలుగు హక్కులు రూ. 45 కోట్లకు ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్ మెంట్ దక్కించుకున్నారు. ఆగస్టు 14న ‘కూలీ‘తో పాటు ‘వార్ 2‘ కూడా విడుదలవుతుంది. ఈనేపథ్యంలో.. ఈ రెండు సినిమాల మధ్య బడా బాక్సాఫీస్ క్లాష్ జరగనుంది. దీంతో.. రెండు చిత్రాలూ ప్రచారంలో నువ్వా నేనా అంటూ పోటీ పడబోతున్నాయి. ఇక ‘కూలీ‘ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగస్టు 7న నిర్వహించబోతున్నారట.
-
Home
-
Menu