‘కూలీ’ మాస్ మేజిక్‌కు రెడీ!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’. ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. లేటెస్ట్ గా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. ఇప్పటికే డబ్బింగ్ పూర్తి చేసుకున్న రజనీ.. చిత్రాన్ని చూసిన వెంటనే దర్శకుడిని హగ్ చేసుకుని, 'నాకు దళపతి ఫీలింగ్ వచ్చింది' అంటూ ప్రశంసలు కురిపించాడట. ఈ వ్యాఖ్యలు సినిమాపై హైప్ ను పెంచేస్తున్నాయి.
ఇంకా ఆసక్తికర విషయమేంటంటే.. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా పరిచయమవుతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం లోకేష్ నాగార్జునకు ఆరుసార్లు స్టోరీ వినిపించారట. ఈ సినిమాలో సైమన్ అనే పవర్‌ఫుల్ రోల్ లో నాగ్ కనిపించనున్నాడు. ఈ సినిమాకి రోజుకు 700-1000 మంది వరకు పని చేసినట్టుగా లోకేష్ తెలిపాడు.
ఇటీవల 'కూలీ' నుంచి రిలీజైన పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ ‘మోనికా మై డియర్ మోనికా’ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహీర్, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో మెరవబోతుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
-
Home
-
Menu