‘కూలీ’ క్రేజ్.. బిగ్ డీల్ ఫిక్స్!

‘కూలీ’ క్రేజ్.. బిగ్ డీల్ ఫిక్స్!
X
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘కూలీ’. లేటెస్ట్ గా ఈ మూవీ ఓటీటీ డీల్ కి క్రేజీ ఆఫర్ దక్కినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘కూలీ’. ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ వంటి పలు భాషలకు సంబంధించిన స్టార్స్ కీలక పాత్రల్లో మురిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది.

లేటెస్ట్ గా ఈ మూవీ ఓటీటీ డీల్ కి క్రేజీ ఆఫర్ దక్కినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రముఖ ఓటిటి సంస్థ, ఈ సినిమా హక్కులను దాదాపు రూ.120 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా, ఈ డీల్ రజనీకాంత్ గత బ్లాక్‌బస్టర్ ‘జైలర్’ హక్కులు కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియోదే కావొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే, ఈ విషయంపై చిత్రబృందం నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ‘కూలీ’ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. రజనీకాంత్ కెరీర్‌లో 'కూలీ' మరో సెన్సేషనల్ హిట్ అవుతుందనే అంచనాలతో ఆయన అభిమానులు ఉన్నారు.

Tags

Next Story