'వార్ 2' దెబ్బకు 'కూలీ' వెనకడుగు?

వార్ 2 దెబ్బకు కూలీ వెనకడుగు?
X

ఈ ఆగ‌స్టులో బాక్సాఫీస్‌ దగ్గర ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ క్రేజీ మల్టీస్టారర్ 'వార్ 2', రజనీకాంత్ మల్టీస్టారర్ 'కూలీ' ఒక్క రోజు గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.

ఎన్టీఆర్-హృతిక్ కాంబోలో రూపొందుతున్న ‘వార్ 2’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హృతిక్, తారక్ వంటి పాన్ ఇండియా స్టార్‌లు కలిసి నటించడం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. పైగా యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో భాగంగా ఈ చిత్రం రాబోతుంది.

ఇక ‘కూలీ’ విషయానికి వస్తే, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపైనా భారీ అంచనాలున్నాయి. రజనీకాంత్ తో పాటు ఈ మూవీలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి భారీ తారాగణం నటిస్తుంది. దీంతో ఇది కూడా మల్టీ స్టారర్‌గానే పరిగణించవచ్చు. స్టైలిష్ డైరెక్టర్ లోకేషన్ కనకరాజ్ 'కూలీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఈ రెండు భారీ చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ లో విడుదల కానుండడం. సాధారణంగా రెండు పెద్ద సినిమాలు ఒకే సమయానికి విడుదల అయితే వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. 'కూలీ' చిత్రానికి సౌత్ లో మంచి మార్కెట్ ఉంటుంది. అయితే బాలీవుడ్ మూవీ 'వార్ 2'లో ఎన్టీఆర్ కూడా నటిస్తుండడంతో.. 'కూలీ'కి ఈ చిత్రం సౌత్ లో పెద్ద పోటీగా మారనుంది. మరోవైపు హిందీలో ఎలాగూ 'వార్ 2' హవా కొనసాగుతుంది. దీంతో 'కూలీ' హిందీ వెర్షన్ కి అక్కడ పెద్ద దెబ్బే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ 'కూలీ' కోసం ఇప్పుడు మరో తేదీని వెతికే పనిలో ఉన్నారట మేకర్స్.

Tags

Next Story