టాలీవుడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి హామీ

టాలీవుడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి హామీ
X
సినీ కార్మికుల సమ్మె విరమణ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తో భేటి అయిన నిర్మాతలు, దర్శకులు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి.

సినీ కార్మికుల సమ్మె విరమణ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తో భేటి అయిన నిర్మాతలు, దర్శకులు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి. ఇటీవల టాలీవుడ్‌ సమ్మె వల్ల చిత్ర పరిశ్రమకు ఎదురైన సమస్యలపై స్పందిస్తూ, సమ్మె విరమణకు తానే చొరవ చూపినట్లు సీఎం వెల్లడించారు.

'పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలి. కార్మికుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి. కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంపొందించేందుకు కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలి. స్కిల్‌ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం' అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

పరిశ్రమలో సంస్కరణలు అవసరమని, నిర్మాతలు–కార్మికులు–ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకురావాలని సూచించారు. పరిశ్రమను ఎవరూ నియంత్రించలేరని, అందరూ చట్ట పరిధిలో ఉండాలని స్పష్టం చేశారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం తెలిపారు.

ఈ భేటీకి నిర్మాతలు దిల్‌ రాజు, అల్లు అరవింద్‌, సురేష్‌ బాబు, నవీన్ ఎర్నేని, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నాగవంశీ, డివివి దానయ్య, బాపినీడు, చెరుకూరి సుధాకర్, సాహు గారపాటి, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము.. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల తదితరులు హాజరయ్యారు.

Tags

Next Story