'మాస్ జాతర' కొత్త డేట్ పై క్లారిటీ?

మాస్ జాతర కొత్త డేట్ పై క్లారిటీ?
X
మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రంగా రెడీ అవుతుంది 'మాస్ జాతర'. మొదట వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు.

మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రంగా రెడీ అవుతుంది 'మాస్ జాతర'. మొదట వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. అయితే కార్మిక సంఘాల సమ్మెతో షూటింగ్ పూర్తి కాకపోవడం, ఇతర నిర్మాణ సమస్యల కారణంగా వాయిదా పడింది.

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ఇంకా ఒక మాంటేజ్ సాంగ్, ప్యాచ్ వర్క్ మిగిలి ఉన్నాయట. మొదట మేకర్స్ సెప్టెంబర్ 12న విడుదల చేయాలని భావించినా, అది కూడా సాధ్యం కాకపోవడంతో చివరికి దీపావళి సీజన్‌కి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రంలో రవితేజాకి జోడీగా శ్రీలీల నటిస్తుంది. భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ – ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. మరి.. 'మాస్ జాతర' కొత్త రిలీజ్ డేట్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

Tags

Next Story