నాని లైనప్‌పై వచ్చేసిన క్లారిటీ!

నాని లైనప్‌పై వచ్చేసిన క్లారిటీ!
X
నేచురల్ స్టార్ నాని తన సినిమాల విషయంలో ఎప్పుడూ కన్సిస్టెన్సీ, వెర్సటాలిటీని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

నేచురల్ స్టార్ నాని తన సినిమాల విషయంలో ఎప్పుడూ కన్సిస్టెన్సీ, వెర్సటాలిటీని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ‘దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం’ వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న నాని.. ఇప్పుడు ‘హిట్-3’తో మరోసారి తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత 'ది ప్యారడైజ్' కూడా రెడీ అవుతుంది.

'ది ప్యారడైజ్' కంటే ముందే.. అంటే 'హిట్ 3' తర్వాత నాని లైన్లో పెట్టిన మరొక సినిమా ఉంది. అదే సుజీత్ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించాల్సిన చిత్రం. సుజీత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉండగా, ఈ సినిమా నిర్మాణంలో జాప్యం కారణంగా నాని ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. ఇదే విషయాన్ని లేటెస్ట్‌గా 'హిట్ 3' ప్రమోషన్స్ లో తెలిపాడు నాని.

ప్రస్తుతం సుజీత్.. పవన్ కళ్యాణ్‌తో ‘ఓజి’ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడని.. అది పూర్తైన వెంటనే తనతో సినిమా మొదలవుతోందని నాని అన్నాడు. అంటే.. పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పూర్తయితే... ఆ వెంటనే నాని మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. మొత్తంగా 'హిట్ 3' తర్వాత 'ది ప్యారడైజ్, సుజీత్ సినిమాలను లైన్లో పెట్టాడు నాని.

Tags

Next Story