చిరు-ఓదెల సినిమా.. నాని నుండి క్రేజీ అప్డేట్!

చిరు-ఓదెల సినిమా.. నాని నుండి క్రేజీ అప్డేట్!
X

‘దసరా’ చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన తర్వాత ప్రాజెక్ట్స్‌ ను క్రేజీగా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నానితో 'ది ప్యారడైజ్' మూవీని తెరకెక్కిస్తున్న శ్రీకాంత్.. ఆ తర్వాత మెగాస్టార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. చిరంజీవి సినిమాకి నిర్మాతల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు.


లేటెస్ట్ గా నాని తన ప్రొడక్షన్ నుంచి వస్తోన్న ‘కోర్ట్’ మూవీ ప్రెస్ మీట్ లో చిరు-ఓదెల ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చాడు. చిరు-ఓదెల మూవీ వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపాడు. అంటే ఈ సంవత్సరం చివరిలో చిరు-ఓదెల సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం 'విశ్వంభర'తో బిజీగా ఉన్న మెగాస్టార్.. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. చిరు-అనిల్ ప్రాజెక్ట్ ఈ వేసవి నుంచి పట్టాలెక్కనుంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు 'విశ్వంభర' చిత్రాన్ని మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags

Next Story