చిరు-నయన మూడోసారి!

చిరు-నయన మూడోసారి!
X
మెగాస్టార్ చిరంజీవి-లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. తొలుత చిరు 'సైరా'లో కథానాయికగా నటించిన నయన.. 'గాడ్ ఫాదర్'లో చెల్లెలు పాత్రలో కనిపించింది.

మెగాస్టార్ చిరంజీవి-లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. తొలుత చిరు 'సైరా'లో కథానాయికగా నటించిన నయన.. 'గాడ్ ఫాదర్'లో చెల్లెలు పాత్రలో కనిపించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నారనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతుంది.

ఈసారి చిరంజీవి, నయనతార లను కలుపుతుంది అపజయమెరుగని అనిల్ రావిపూడి. చిరుతో అనిల్ చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా నయనతార ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాలో చిరుకి జోడీగా అదితి రావు, పరిణీతి చోప్రా పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎనర్జిటిక్ ట్యూన్స్ తో అలరించే భీమ్స్.. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకున్న చిరు-అనిల్ మూవీ త్వరలో పట్టాలెక్కనుంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రెడీ అవుతుంది.

Tags

Next Story