'హర్ ఘర్ తిరంగా' కోసం చిరు

హర్ ఘర్ తిరంగా కోసం చిరు
X
ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మనం గర్వంగా జెండా ఆవిష్కరిస్తాం. దేశభక్తి గీతాలు ఆలపిస్తాం. అయితే ఈసారి జాతీయ జెండాను ప్రతీ ఇంట్లో ఆవిష్కరించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.

'ప్రతి ఇంటి ముందు త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని కలలు కనే ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో భాగమవ్వండి.. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ఆగస్టు 11 నుండి 15 వరకు మీ ఇంటి ముందు జాతీయ జెండాను ఎగురవేసి, దేశభక్తిని చాటండి..' అంటూ మెగాస్టార్ చిరంజీవి కూడా పిలుపునిచ్చారు.

ఇంకా 'మీరు కూడా ఈ ఉత్సాహవంతమైన ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి వాలంటీర్‌గా చేరండి. http://harghartiranga.comలో రిజిస్టర్ చేసుకోండి మరియు మీ పొరుగువారిని కూడా ఈ ఉద్యమంలో చేరమని ప్రోత్సహించండి. మీరు జాతీయ జెండాతో తీసుకున్న సెల్ఫీలను వెబ్ సైట్ లో పోస్ట్ చేయండి.' అంటూ ఈ ఉద్యమం గురించి ఓ వీడియోని షేర్ చేశారు చిరంజీవి.

Tags

Next Story