సక్సెస్ ఫార్ములా వదలని చిరు-బాలయ్య!

సక్సెస్ ఫార్ములా వదలని చిరు-బాలయ్య!
X
లెజెండరీ యాక్టర్స్ చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరికీ సంక్రాంతి సీజన్ లో రేర్ కలెక్షన్ల రికార్డులు ఉన్నాయి. అలాగే ఇద్దరూ సంక్రాంతి బరిలో బాక్సాఫీసు వద్ద పలుమార్లు పోటీపడ్డారు. వీటిలో 2023 సంక్రాంతి క్లాష్ ఒకటి.

లెజెండరీ యాక్టర్స్ చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరికీ సంక్రాంతి సీజన్ లో రేర్ కలెక్షన్ల రికార్డులు ఉన్నాయి. అలాగే ఇద్దరూ సంక్రాంతి బరిలో బాక్సాఫీసు వద్ద పలుమార్లు పోటీపడ్డారు. వీటిలో 2023 సంక్రాంతి క్లాష్ ఒకటి. ఒకే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో చిరు, బాలయ్య నటించిన ‘వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి’ 2023 సంక్రాంతికి విడుదలయ్యాయి. రెండు సినిమాలు భారీ విజయాలను సాధించి బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి.


బాబీ దర్శకత్వంలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో ‘వీర సింహారెడ్డి’ రూపొందాయి. ఆ తర్వాత బాబీ.. బాలకృష్ణతో 'డాకు మహారాజ్' తీయగా.. మలినేని హిందీలో సన్నీడియోల్ తో 'జాట్'ను తెరకెక్కిస్తున్నాడు. ఇంతకీ విషయమేమిటంటే 2023 సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య లకు భారీ విజయాలందించిన బాబీ, మలినేని ఇద్దరూ.. మళ్లీ తమ ఫేవరెట్ స్టార్స్ తో సినిమాలు చేయబోతున్నారు.


మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నటసింహం బాలకృష్ణ. 'అఖండ 2' తర్వాత బాలయ్య-మలినేని కాంబో పట్టాలెక్కనుందట. ఇక చిరంజీవి సైతం తనకు 'వాల్తేరు వీరయ్య' వంటి ఆల్‌టైమ్ హిట్ ఇచ్చిన బాబీతో మరో మూవీకి కమిట్ అయ్యాడట. ప్రస్తుతం చిరంజీవి కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట బాబీ.

Tags

Next Story