వచ్చే సంక్రాంతి బరిలో చిరు-అనిల్ మూవీ!

వచ్చే సంక్రాంతి బరిలో చిరు-అనిల్ మూవీ!
X

వచ్చే సంక్రాంతి బరిలో చిరు-అనిల్ మూవీ!సెంట్ పర్సెంట్ సక్సెస్ రేటుతో టాలీవుడ్‌లో తనదైన మార్క్ క్రియేట్ చేశాడు అనిల్ రావిపూడి. సంక్రాంతి కానుకగా విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం'తో వరుసగా ఎనిమిదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 'భగవంత్ కేసరి'తో బాలకృష్ణకు భారీ విజయాన్ని అందించిన అనిల్.. ఇప్పుడు వెంకటేష్ కి హిట్ ఇచ్చాడు. సంక్రాంతి పండుగకు విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.

బాలకృష్ణ, వెంకటేష్ తర్వాత మరో సీనియర్ హీరో చిరంజీవితో సినిమాకి సిద్ధమవుతున్నాడు. చిరంజీవి కోసం ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనర్ ను ఎంచుకున్నాడట అనిల్ రావిపూడి. ఆ కథ చిరంజీవిని ఆకట్టుకుందని సమాచారం. ఈ వారంలోనే చిరు-అనిల్ మూవీకి సంబంధించి అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ రానుందట. ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించబోతున్నారు. 2026 సంక్రాంతి టార్గెట్ గా ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉందట.

Tags

Next Story