పవన్ సెట్లో చిరు సందడి

ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలతో రాజకీయాల్లో బిజీగా ఉన్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుకు ఒప్పుకున్న సినిమాలను వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈకోవలో ఇప్పటికే ‘హరిహర వీరమల్లు, ఓజీ‘ షూటింగ్స్ ఫినిష్ చేసి ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్‘తో బిజీగా మారాడు. లేటెస్ట్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ మూవీ సెట్స్‌లోకి అనుకోని అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు.
హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సమయంలో, దర్శకుడు హరీష్ శంకర్ పవన్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తుండగా, చిరు హాజరయ్యారు. పవన్ పక్కనే కూర్చుని మానిటర్‌లో సీన్లు వీక్షించారు చిరంజీవి. ఇక చాలా రోజుల తర్వాత చిరంజీవి – పవన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ నిజ జీవితంలోని ఓ వైరల్ సన్నివేశాన్ని (కారు పై కూర్చుని ప్రయాణం) హరీష్ శంకర్ రీక్రియేట్ చేస్తున్నట్టు సమాచారం. పవన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది.
-
Home
-
Menu