చిరంజీవికి యూకే పార్లమెంట్‌లో విశేష గౌరవం!

X
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.బ్రిటన్ రాజధాని లండన్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్— యూకే పార్లమెంట్ వేదికగా ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు, సమాజానికి అందించిన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ఆయనకు అందజేశారు.
ఈ ఘనమైన కార్యక్రమాన్ని యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా నేతృత్వంలో నిర్వహించారు. పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్‌మాన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిరంజీవి సినీ ప్రయాణాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Next Story
-
Home
-
Menu