మరోసారి మెగాస్టార్ ఔదార్యం

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలుగు సినిమా ప్రపంచంలో ఒక సంచలనం. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి, తన నటనతోనే కాక, మానవతా దృక్పథంతో కూడా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. ఆగస్టు 22 చిరంజీవి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటి, అందరి మనసులు గెలుచుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్షేమ నిధికి చిరంజీవి ఏకంగా 1 కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి చెక్ అందజేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఫోటోలో చిరంజీవి, చంద్రబాబు ఇద్దరూ నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ దృశ్యం చూసిన మెగా అభిమానులు తమ హీరో ఔదార్యాన్ని, సమాజం పట్ల ఆయన చూపే బాధ్యతను చూసి గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. చిరంజీవి గతంలోనూ అనేక సందర్భాల్లో తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆపద సమయాల్లో విరాళాలు, సామాజిక కార్యక్రమాలకు మద్దతు, రక్తదాన శిబిరాలు, ఆక్సిజన్ బ్యాంకులు ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆయన తన సామాజిక బాధ్యతను నిరూపించారు.
-
Home
-
Menu