'కూలీ' నుంచి 'చికిటు' సాంగ్!

సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్‌కి అదిరిపోయిన రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా ఈ మూవ ఈనుంచి ‘చికిటు’ అంటూ సాగే మాస్ సాంగ్ రిలీజయ్యింది. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట తమిళ వెర్షన్ ను టి.రాజేందర్, అరివు, అనిరుధ్ కలిసి ఆలపించారు.
మ్యూజిక్, లిరిక్స్, డ్యాన్స్ అన్నీ కలసి 'చికిటు' ఓ పక్కా తలైవా మాస్ ఫెస్ట్‌ను గుర్తుచేస్తుంది. ఈ పాటలో వెటరన్ యాక్టర్, డైరెక్టర్ టి.రాజేందర్ స్పెషల్ అప్పీరెన్స్ మరో అట్రాక్షన్. క్యాచీ బీట్స్, ఎనర్జిటిక్ విజువల్స్ తో ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ప్రస్తుతానికి అనిరుధ్, టి.రాజేందర్ లతో మ్యూజిక్ వీడియోగా 'చికిటు'ని రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ మాస్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
-
Home
-
Menu