చరణ్-సుకుమార్ సిట్టింగ్స్ షురూ

చరణ్-సుకుమార్ సిట్టింగ్స్ షురూ
X
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోయే క్రేజీ ప్రాజెక్ట్స్ లో రామ్ చరణ్ -సుకుమార్ సినిమా ఒకటి. ఇప్పటికే వీరిద్దరి కలయికలో ‘రంగస్థలం‘ వంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది.

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోయే క్రేజీ ప్రాజెక్ట్స్ లో రామ్ చరణ్ -సుకుమార్ సినిమా ఒకటి. ఇప్పటికే వీరిద్దరి కలయికలో ‘రంగస్థలం‘ వంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఆ తర్వాత చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్‘తో గ్లోబల్ స్టార్ గా మారితే.. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ‘పుష్ప 2‘తో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు.

పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజున్న చరణ్-సుక్కూ ఇప్పుడు మరోసారి కలిసి పనిచేయబోతున్న మూవీ ‘ఆర్.సి.17‘. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అనౌన్స్ మెంట్ వచ్చింది. లేటెస్ట్ గా ‘ఆర్.సి.17‘ కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడట సుకుమార్. దుబాయ్ లో ఈరోజు నుంచి ఈ మూవీ స్క్రిప్ట్ పనులు షురూ అయినట్టు సోషల్ మీడియా టాక్.

చరణ్, సుకుమార్ కొత్త సినిమాకి సంబంధించి కథాంశం గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఓ కౌబాయ్ స్టోరీతో రాబోతున్నారని.. అలాగే ‘రంగస్థలం‘ సీక్వెల్ ను తీసుకు రాబోతున్నారనే కథనాలు వస్తున్నాయి. మరి.. ఈసారి చరణ్ ను సుకుమార్ ఎలాంటి పాత్రలో ఆవిష్కరిస్తాడో చూడాలి.

Tags

Next Story