చరణ్-సుకుమార్ కౌబాయ్ స్టోరీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు తెలుగు సినీ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' మీద ఇప్పటికే విపరీతమైన చర్చ నడుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
'పెద్ది' తర్వాత క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తో నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు చరణ్. మైత్రీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కలయికలో 'రంగస్థలం' వచ్చి బ్లాక్‌బస్టర్ సాధించింది. దీంతో.. చెర్రీ-సుక్కూ కాంబో RC17 పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
టాలీవుడ్‌లో ఒకప్పుడు హవా చేసిన కౌబాయ్ జానర్‌ను ఈ సినిమా మళ్లీ రీడిఫైన్ చేయబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ గుర్రపు స్వారీ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ టాలెంట్‌ను సుకుమార్ పూర్తిగా వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నాడట.
ప్రస్తుతం వీరిద్దరి కాంబో మూవీ ప్రీ–ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాది చివర్లోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందట. త్వరలోనే ఫైనల్ కాస్టింగ్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలావుంటే, ఇటీవల సుకుమార్ తన టీమ్‌తో కలిసి బ్యాంకాక్ వెళ్లి, స్టోరీపై బ్రెయిన్‌స్టార్మింగ్ సెషన్స్ నిర్వహించినట్లు సమాచారం.
'పుష్ప'తో సుకుమార్ చూపించిన మాస్ రేంజ్, రామ్ చరణ్‌కు ఉన్న గ్లోబల్ క్రేజ్ కలిసి రావడం వల్ల ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో ఉండబోతుందన్న ఊహాగానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. 'పెద్ది'తో మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్, RC17తో ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకునేలా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
-
Home
-
Menu